తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్పు !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణతీసుకుంది. సమావేశం అనంతరం ధర్మకర్త మండలి నిర్ణయాలను ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14 శాతం నుంచి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు తితిదే రూ.4 కోట్లు ఇచ్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. అలాగే తితిదే ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి కమిటీ ఏర్పాటు, తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్పు, రెండు అతిథి గృహాల పేర్లు మార్చలేదు. వాటికి తితిదేనే పేర్లు మార్చనుంది. ఆకాశగంగ, పాపవినాశం, కాలికనడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ, స్విమ్స్‌ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం, ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయం, తిరుమలలో యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ వాడుకోవాలని నిర్ణయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్ట ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్‌ ప్రణాళిక తయారీకి ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం. తిరుమలలోని బిగ్‌ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్స్‌ ఫీజు నిర్ణయానికి ఆమోదం. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం. తితిదేలో పనిచేస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదం. తుళ్లూరు మండలం అనంతవరంలోని తితిదే ఆలయం అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం.  శ్రీవారి నామావళిని రీమిక్స్‌ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన డీడీ నెక్స్ట్‌ లెవెల్‌ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.  

Post a Comment

0Comments

Post a Comment (0)