బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 300 కి.మీ. వంతెన పూర్తి : వీడియో షేర్ చేసిన అశ్వినీ వైష్ణవ్

Telugu Lo Computer
0


హ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 300 కి.మీ. వంతెన పూర్తయిందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్  వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అహ్మదాబాద్‌-ముంబయి మధ్య పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్‌ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. బుల్లెట్‌ ట్రైన్‌ తొలి ట్రయల్స్‌ను 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా గంటకు 350 కి.మీ. వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్‌ అయ్యే వేగంతో సమానమని తెలిపారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కి.మీ. వేగంతో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ విలువ రూ.1.08 లక్షల కోట్లు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)