సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుజరాత్‌లో ఆపరేషన్ చేపట్టారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 20 మందిని అరెస్టు చేశారు. సూరత్‌లో వారిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ నిందితులపై తెలంగాణలో 60, దేశ వ్యాప్తంగా 515పైగా కేసులు నమోదై ఉన్నాయి. నిందితుల కోసం సూరత్ వెళ్లిన పోలీసులు.. రెండు బృందాలుగా విడిపోయి 10 రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించారు. నిందితుల్లో ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, డీసీబీ బ్యాంకు వాపి బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్ ఉన్నట్లు గుర్తించారు. పెట్టుబడుల పేరుతో, పార్ట్ టైం జాబ్ సహా ఇతర నేరాల కేసుల్లో వీరంతా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి నుంచి 20 మొబైల్స్, 28 సిమ్‌కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్కుబుక్‌లు, 2 రబ్బర్ స్టాంపులు, ఇతర డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నారు.
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 20 మందిని గుజరాత్‌లో అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు
May 12, 2025
0
Tags