తిరుమలలో ఆఫ్‌లైన్‌లో ఇస్తోన్న శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిపోయాయంటూ సోషల్‌మీడియాలో కొందరు చేస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. వాస్తవానికి ఆన్‌లైన్‌లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్‌పోర్టులో 200 టికెట్లు అందుబాటులో ఉండగా ఎప్పటికప్పుడు భక్తులు వాటిని బుక్ చేసుకుంటున్నారని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ''ఏ రోజు కూడా ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నాం. గత కొన్ని రోజుల్లో ఆఫ్‌లైన్‌లో పదుల సంఖ్యలో తగ్గాయే కానీ, వందల సంఖ్యలో టికెట్లు మిగిలిపోయాయని కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదు'' అని తితిదే పేర్కొంది.
శ్రీవాణి దర్శన టికెట్లపై దుష్ప్రచారానికి తితిదే ఖండన
May 12, 2025
0
Tags