ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ కొత్త ప్లాన్‌ రూ.399కే బ్రాండ్‌బ్యాండ్+ డీటీహెచ్‌

Telugu Lo Computer
0


యిర్‌టెల్‌ బ్లాక్‌ ప్లాన్‌ను సవరించింది. ఇకపై రూ.399 నుంచే ఐపీటీవీ సేవలను అందించనుంది. దీనిలో డేటా, డీటీహెచ్‌ ప్రయోజనాలు, ల్యాండ్‌ లైన్‌ నుంచి అపరిమిత కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని అందించనుంది. ఇప్పటి వరకు ఐపీటీవీ ప్లాన్ల ధరలు రూ.699 నుంచి ప్రారంభం అవుతుండగా ఇకపై రూ.399 నుంచే (జీఎస్టీ అదనం) లభించనున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా రెండు వేల నగరాల్లో ఐపీటీవీ సేవలను ఎయిర్‌టెల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఎంట్రీలెవల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ రూ.399కు సవరణ చేసి ఐపీటీవీ సేవలను జోడించింది. ఈ ప్లాన్‌పై 10 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు లభిస్తాయి. ఎఫ్‌యూపీ (3,300జీబీ వరకు) పరిమితి తర్వాత ఇంటర్నెట్‌ వేగం 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో 260 టీవీ ఛానెళ్లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఎలాంటి ఓటీటీ ప్రయోజనాలు  ఉండవు. కొత్త కనెక్షన్‌ తీసుకోవాలనుకునే వారు ఒకేసారి రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. హార్డ్‌వేర్‌ ఇన్‌స్టలేషన్‌కు ఎలాంటి రుసుములూ చెల్లించనక్కర్లేదు. ఈ మొత్తాన్ని రాబోయే బిల్లింగ్‌ సైకిల్‌లో సర్దుబాటు చేస్తారు. ఓటీటీ ప్రయోజనాలు లేకుండా కేవలం తక్కువ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌, ఐపీటీవీ సేవలు కోరుకునేవారు రూ.399 ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ వేగంతో కూడిన డేటా, ఓటీటీ ప్రయోజనాలు కావాలంటే రూ.699, రూ.899, రూ.1199, 1599 వంటి ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా ప్లాన్లను బట్టి జియోహాట్‌స్టార్‌, సోనీలివ్‌, అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 వంటి ఓటీటీ బెన్‌ఫిట్స్‌ లభిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)