తెలంగాణలోని రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో నూతన వంగడాలను విడుదల చేశారు. పరిశోధనాస్థానం కార్యాలయంలో అధిపతి డాక్టర్ అంజయ్య విలేకరులతో మాట్లాడుతూ చెరుకు పంటలో అధిక లాభాలు పొందవచ్చన్నారు. 2024 లో రుద్రూర్ వరి (ఆర్డీఆర్ 1162) స్వల్ప కాలిక రకం విడుదల చేశామన్నారు. ఈ రకం రెండు కాలాలకు అనువైనదని వానా కాలంలో (120-, 125) రోజులు, యాసంగిలో (130-, 135) రోజులు పంట కాల పరిమితి కలిగిన మిక్కిలి సన్నగింజ రకం అని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రమ్య, డాక్టర్ రాజుకుమార్, సాయిచరణ్, తదితరులు పాల్గొన్నారు.
120 రోజుల్లో పంట వచ్చే కొత్త రకం వరి వంగడం విడుదల
May 31, 2025
0
Tags