ఆంధ్రప్రదేశ్ లో పట్టపగలే మహిళ గొంతు కోసి దారుణ హత్య చేసిన సంఘటన చిన్నకోడూరు మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గాలి బాలలక్ష్మి (50) కిరాణా షాపు, భర్త సుధాకర్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆమె పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు రూరల్ సీఐ శ్రీను తెలిపారు. ఆమె మెడలో నుండి రెండు వరుసల పుస్తెలతాడును దొంగిలించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో బంగారం కోసమే మహిళను హత్య చేసినట్లు తేలిందని సీఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో పరిశీలించారు. సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీను తెలిపారు.
పట్టపగలే మహిళ గొంతు కోసి దారుణ హత్య
May 31, 2025
0
Tags