ఆంధ్రప్రదేశ్ లో ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు

Telugu Lo Computer
0


కపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. రైస్‌ కార్డు నమోదైన డీలర్‌ దగ్గరే తీసుకోవాలనే నిబంధన లేదు. దీనికి సంబంధించిన సాంకేతిక మార్పులు కూడా చేశాం అని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. 1వ తేదీ నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులు అందించనున్న నేపథ్యంలో సన్నాహక ఏర్పాట్లను ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలో పరిశీలించారు. రేషన్‌దుకాణంలో సరుకు నిల్వలు, వాటి తూకాలు, ఇతర ఏర్పాట్లను అడిగితెలుసుకున్నారు. డీలరు, రెవెన్యూ, తూనికలు కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారుల ఫోన్‌ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాంకేతిక సమస్య తలెత్తినా వారిని గంటల తరబడి కూర్చోబెట్టకుండా ఫొటో తీసుకుని సరుకులు ఇచ్చేలా ఆదేశాలిచ్చామన్నారు. గతంలో ఎండీయూ వాహనాలను వీధి చివర్లో ఆపి కొంతసేపు సరుకులు ఇచ్చి కొంతమందికి రేషన్‌ ఇవ్వకుండా మాయం చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. వీటిని నియంత్రించేందుకే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశామన్నారు. రేషన్‌ దుకాణాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)