ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు ఎరువుల దుకాణం మొత్తం వ్యాపించాయి. ఎరువుల దుకాణంలో రసాయన మందులు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం సమయంలో.. ఘటన సమీపంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘనాస్థలికి చేరుకొని మంటలు ఆదుపు చేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎరువుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
May 31, 2025
0
Tags