భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి సమయం ఆసన్నమైంది : డొనాల్డ్ ట్రంప్

Telugu Lo Computer
0


భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్‌తో వాణిజ్య చర్చలు గొప్పగా జరుగుతాయని వెల్లడించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నట్లు చెప్పారు. భారత్-పాకిస్తాన్ ఘర్షణలకు దిగితే వారితో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తి పోతుందన్నారు. వాణిజ్య చర్చలు జరిపేందుకు వచ్చే వారం పాకిస్తాన్ ప్రతినిధులు కూడా అమెరికా వస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనను పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఏప్రిల్‌లో ట్రంప్ ఆయా దేశాలపై టారిఫ్‌లు ప్రకటించారు. దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేశారు. అయితే భారత్ మాత్రం భిన్నంగా ఆలోచించి ప్రతీకార సుంకాలకు బదులుగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టిసారించింది. ప్రస్తుతం ఆ దిశగానే భారత్ అడుగులు వేస్తోంది. ఇటీవలి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అమెరికా వెళ్లారు. వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వాషింగ్టన్‌కు వెళ్లారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మే 27 నుంచి మే 29 వరకు అమెరికాలో పర్యటించారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌతో మిస్రి సమావేశం అయ్యారు. సెప్టెంబరు-అక్టోబరు నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో భారత్ ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)