రేపటి నుంచి కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడళ్లలో పనిచేయదని వాట్సాప్ ప్రకటించింది. వాస్తవానికి మేలోనే వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్లలో నిలిచిపోవాల్సి ఉన్నా వినియోగదారులకు డేటా బ్యాకప్ కోసం తగినంత సమయం ఇచ్చేందుకు ఈ నెల రోజులు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. వినియోగదారుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెటా ప్రకటించింది. iOS 15 లేదా అంతకన్నా పాత వర్షన్లు, Android 5.0 లేదా అంతకన్నా పాత వర్షన్లలో పనిచేయదు. iPhone 5s, 6, 6 Plus, 6s, 6s Plus, SE (1st Gen), ఆండ్రాయిడ్ ఫోన్లలో Samsung Galaxy S4, Galaxy Note 3, Sony Xperia Z1, LG G2, Huawei Ascend P6, Moto G (1st Gen), Moto E (2014), Motorola RAZR HD లో పనిచేయదు. పాత ఫోన్‌లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందుకోవడం లేదని, సెక్యూరిటీ ప్యాచులు లేకపోవడం వల్ల సైబర్ దాడుల ముప్పు పెరుగుతోందని మెటా స్పష్టం చేసింది. అందువల్ల వ్యక్తిగత సమాచారం గోప్యతకు భంగం కలిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణుల హెచ్చరిక ఉండడం తోనే మెటా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. అయితే వాట్సాప్ పనిచేయడం ఆగిపోనుందని ఫోన్ పారేయాల్సిన అవసరం లేదని, సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోమని సూచిస్తున్నారు.
రేపటి నుంచి పాత ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడళ్లలో వాట్సాప్ బంద్
May 31, 2025
0
Tags