ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గత ఏడాది అక్టోబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన వీలునామాకి సంబంధించి సమాచారం వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా ఎంత ఉదార స్వభావి అనేది ఆయన వీలునామా ద్వారా తెలుసుకోవచ్చు. ఆయన తన ఇంటి పనివారికి, ఆఫీస్ సిబ్బందికి దాదాపు రూ.3.5 కోట్లు వీలునామాలో రాసిచ్చాడు. వీరిలో కార్ క్లీనర్ నుండి ప్యూన్ వరకు అందరూ ఉన్నారు. ఆయన తన ఉద్యోగులకు, పక్కింటి వారికీ ఇచ్చిన అప్పు కూడా మాఫీ చేశాడు. తన ఇంటి పనిమనుషులకు రూ.15 లక్షలు ఇవ్వాలని తన వీలునామాలో పేర్కొన్నారు. అలాగే, పార్ట్‌టైమ్ హెల్పర్లు, కార్ క్లీనర్లకు కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, రతన్ టాటా చిరకాల వంటమనిషి రాజన్ షాకు కోటి రూపాయలకు పైగా రాసిచ్చాడు. ఇందులో రూ.51 లక్షల అప్పు మాఫీ చేస్తూ కూడా ఉంది. తన బట్లర్ సుబ్బయ్య కోనార్ కు రూ.66 లక్షలు ఇవ్వాలని, ఇందులో రూ.36 లక్షల అప్పు మాఫీ కూడా ఉంది. తన సెక్రెటరీ దిల్నాజ్ గిల్డర్ కు కూడా రూ.10 లక్షలు కేటాయించారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదవడానికి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకి ఇచ్చిన రూ.1 కోటి అప్పు కూడా టాటా మాఫీ చేశాడు. అంతేకాదు తన డ్రైవర్ రాజు లియోన్‌కు రూ.1.5 లక్షలు ఇచ్చి, అతని రూ.18 లక్షల అప్పు కూడా మాఫీ చేశాడు. టాటా ట్రస్ట్ కన్సల్టెంట్ హోషి డి మలేసర్‌కు రూ.5 లక్షలు, అలీబాగ్ బంగ్లా కేర్‌టేకర్ దేవేంద్ర కాటమోళ్లుకు రూ.2 లక్షలు, పర్సనల్ అసిస్టెంట్ దీప్తి దివాకరన్‌కు రూ. 1.5 లక్షలు, ప్యూన్‌లు గోపాల్ సింగ్, పాండురంగ్ గురవ్‌లకు రూ.50 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. తన హెల్పర్స్ ఒకరైన సర్ఫరాజ్ దేశ్‌ముఖ్‌కు ఇచ్చిన రూ.2 లక్షల అప్పు కూడా ఆయన మాఫీ చేశారు. అయితే తన జర్మన్ షెపర్డ్ టిటో కోసం రూ.12 లక్షలు కేటాయించారు. టిటో ఇప్పటికీ రాజన్ షా సంరక్షణలోనే ఉంది. టాటా ఇంటి పక్కన ఉండే జేక్ మల్లెట్ కు యూకే లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివేందుకు ఇచ్చిన రూ. 23.7 లక్షల అప్పుడు కూడా మాఫీ చేశాడు. మల్లెట్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. టాటా ఆస్తిలో మూడింట ఒక వంతు (షేర్లు అండ్ రియల్ ఎస్టేట్ మినహా) మాజీ తాజ్ ఉద్యోగి మోహిని దత్తాకు ఇచ్చారు. సీషెల్స్‌లో రూ.85 లక్షల విలువైన అతని భూమిని ఆర్‌ఎన్‌టి అసోసియేట్స్'కి ఇచ్చారు.
వీలునామాలో వంటమనిషికి కోటి రూపాయలు కేటాయించిన రతన్ టాటా !
April 02, 2025
0
Tags