వక్ఫ్ సవరణ బిల్లును భారత పార్లమెంట్లో ఈ రోజు మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఎన్డీయే మిత్ర పక్షాలు సపోర్ట్ చేస్తుండగా, ఇండియా కూటమిలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఏఐఎంపీఎల్బీ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాలో మాట్లాడుతూ ఈ వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే తాము దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన, రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతిపాదిత సవరణలను వెనక్కి తీసుకునే వరకు తాము శాంతియుత ఆందోళనను నిర్వహిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.
వక్ఫ్ బిల్లు సవరణలను వెనక్కి తీసుకునే వరకు శాంతియుత ఆందోళన నిర్వహిస్తాం : ఏఐఎంపీఎల్బీ
April 02, 2025
0
Tags