ఏప్రిల్‌ 8 నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు !

Telugu Lo Computer
0


మారుతీ సుజుకీ వివిధ మోడళ్లపై ధరల పెంపును ప్రకటించింది. ఏప్రిల్‌ 8 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. కనిష్ఠంగా రూ.2,500 నుంచి గరిష్ఠంగా రూ.62 వేల వరకు వివిధ మోడళ్లపై ఈ పెంపును ప్రకటించింది. సవరించిన ధరల ప్రకారం.. మారుతీ సుజుకీకి చెందిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ధర రూ.2,500 మేర పెరగనుంది. డిజైర్‌ టూర్‌ ఎస్‌ రూ.3 వేలు, మల్టీ పర్పస్‌ వెహికల్స్‌ ఎక్స్‌ఎల్‌ 6, ఎర్టిగా రూ.12,500 చొప్పున పెరగనున్నాయి. వ్యాగనార్‌ ధర రూ.14వేలు, ఈకో వ్యాన్‌ ధర రూ.22,500 చొప్పున పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ఎస్‌యూవీ గ్రాండ్‌ విటారాపై రూ.62 వేల వరకు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. ఎంట్రీ లెవల్‌ ఆల్టో కే10 నుంచి ఎంపీవీ ఇన్విక్టో వరకు వివిధ వాహనాలను మారుతీ విక్రయిస్తోంది. జనవరిలో వివిధ మోడళ్లపై రూ.32,500 వరకు ధరల పెంపును మారుతీ ప్రకటించడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)