ప్రైమ్‌ వీడియోలతో పాటు యాపిల్‌ టీవీ + వీడియోలు !

Telugu Lo Computer
0


టీటీల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను పెంచుకోవాలని ప్రైమ్‌ వీడియో చూస్తోంది. అందులో భాగంగా తన ఓటీటీ వేదికగా యాపిల్‌ టీవీ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని జోడించింది.  ఇకపై ప్రైమ్‌ వీడియోలతో పాటు యాపిల్‌ టీవీ + వీడియోలు వీక్షించవచ్చు. యాపిల్‌ టీవీ ప్లస్‌ వీడియోల కోసం ప్రైమ్‌ యూజర్లు యాడ్‌ ఆన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. నెలకు రూ.99 వెచ్చించి ఈ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రైమ్‌ వీడియోలతో పాటు అదే ప్లాట్‌ఫామ్‌ వేదికగా యాపిల్‌ టీవీ + వీడియోలు వీక్షించొచ్చు. ఏప్రిల్‌ 2 నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది అక్టోబర్‌లోనే అమెరికాలో ఈ తరహా సదుపాయాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించింది. డిస్నీ+ హాట్‌స్టార్‌, జియో సినిమా విలీనం పూర్తయిన రెండు నెలల తర్వాత ప్రైమ్‌ వీడియో నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)