ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరల పెంపుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఔషధాల ధరలు పెంచడం ఆమోదయోగ్యం కాదని, ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బెంగాల్ వ్యాప్తంగా ఏప్రిల్ 4-5 తేదీల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అత్యవసర ఔషధాల ధరలు పెంచితే సామాన్యులు వైద్య చికిత్సను ఎలా భరించగలరని ప్రశ్నించారు. రోగులకు వైద్యులు మందులు రాసినప్పుడు వారు 40, 50, 60 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం మందుల ధరలను ఎందుకు పెంచుతోందని అడిగారు. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మరోవైపు, శ్రీరామ నవమి వేడుకల వేళ అన్నివర్గాల ప్రజలు శాంతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఔషధాల ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు మమతా బెనర్జీ పిలుపు
April 02, 2025
0
Tags