ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇవాళ నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, జనసేన నేతలు హాజరయ్యారు. అనంతరం సతీసమేతంగా నాగబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబు, పద్మజ దంపతులు సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నాగబాబుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. నాగబాబుకు శాలువా కప్పి, వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)