ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్డు-పడుగుపాడు స్టేషన్ల మధ్య సిగ్నల్‌లో సాంకేతిక సమస్య సృష్టించి బెంగళూరు ఎక్స్‌ప్రెస్, చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపి దొంగలు దోపిడికి పాల్పడ్డారు. బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-4, ఎస్-5, బోగీల్లో మహిళల మెడలోని బంగారం దోచుకున్నారు. చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-2, ఎస్-3, ఎస్-5 భోగీలలో నగలతో పాటు బ్యాగ్‌లను కూడా అపహరించుకుపోయారు. ఆర్‌పిఎఫ్, జీఆర్ఫీ బృందాల నిర్లక్ష్యం వల్లే ఈ దోపిడి జరిగిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. అల్లూరు స్టేషన్‌లో సిసిటివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో రైళ్లల్లో దొంగల దోపిడీ !
April 02, 2025
0
Tags