లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో సూచీలకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 150 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23,200 పైన ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఉదయం సెన్సెక్స్‌ 328 పాయింట్లు లాభంతో 76,372 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,258 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, జొమాటో, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 74.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,160 డాలర్ల మార్క్‌ను దాటి ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.73 వద్ద ప్రారంభమైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)