రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడతున్నారని వార్తలు వస్తున్నాయి. వైరస్ కారణంగా వారు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు వార్తాసంస్థలు పేర్కొన్నాయి. పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని నివేదికలు వెలువడ్డాయి. అయితే కొవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని, ఇది మరో కొత్త వైరస్ అయి ఉం టుందని అభిప్రాయం వ్యక్తంచేశాయి. ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తంచేశాయి. కొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధ పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా ఈ నివేదికలను రష్యన్ అధికారులు ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని, కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్ధరించారని తెలిపారు. ఒకవేళ కొవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవడానికి తగిన సదుపాయలు ఉన్నాయన్నారు.
రష్యాలో కొవిడ్ తరహా వైరస్ : ఖండించిన రష్యన్ అధికారులు
April 02, 2025
0
Tags