జనాభా లెక్కలను వెంటనే ప్రారంభించాలి !

Telugu Lo Computer
0


బీజేపీ ప్రభుత్వం వెంటనే జనాభాను లెక్కలను ప్రారంభించాలని  ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో డిమాండ్ చేశారు. 1881 నుంచి దేశ జనాభా లెక్కలను పదేండ్లకు క్రమంగా తప్పకుండా జనాభాను లెక్కలను చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీ, ఆర్థిక మాంద్యం సమయంలోనూ ఆ ప్రక్రియను కొనసాగించారని ఖర్గే పేర్కొన్నారు. మన ఆరోగ్య పరిస్థితిని వైద్య పరీక్షల ద్వారా ఎట్లా తెలుసుకుంటామో, అదే విధంగా జనాభా లెక్కలు కూడా దేశం పరిస్థితిని అంచనా వేస్తుందని జాతిపిత మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ఖర్గే గుర్తుచేశారు. దేశజనాభా గణన కేవలం జనాభా పెరుగుదలను తెలియజేయడమే కాకుండా ఉపాధి, కుటుంబ నిర్మాణం, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక కీలక అంశాలను బహిర్గత పరుస్తుందని ఆయన రాజ్యసభలో స్పీకర్కు వివరించారు. రెండో వరల్డ్ వార్, పాక్-ఇండియా మధ్య యుద్ధం నెలకొన్న సమయంలో కూడా జనాభా లెక్కలు చేపట్టారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పాలనలో జనాభా లెక్కింపు ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేశారని కేంద్రంపై మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. అంతేకాకుండా ఈ ఏడాది బడ్జెట్లో కూడా కేవలం రూ.575 కోట్లే కేటాయించారని, బహుశా ఏడాది కూడా జనాభా లెక్కలను సేకరించడం మోడీ ప్రభుత్వానికి ఇష్టంలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ కులాల వివరాలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన కులాల వివరాలు ఎందుకు సేకరించలేదని రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)