ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆఫ్షోర్ మైనింగ్ టెండర్ల విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖ ద్వారా తెలియజేశారు. కేరళ, గుజరాత్ , అండమాన్ & నికోబార్ తీర ప్రాంతాలలో ఆఫ్షోర్ మైనింగ్ టెండర్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వస్తున్న వ్యతిరేకత పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీని ద్వారా తీర ప్రాంతాలలో ఆఫ్షోర్ మైనింగ్ కు అనుంతించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండా ఆఫ్ షోర్ మైనింగ్ కు టెండర్లు వేసిన తీరుపై తీర ప్రాంత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని తెలియజేశారు. అలాగే లక్షలాది మంది మత్స్యకారులు తమ జీవనోపాధి, జీవన విధానంపై దాని ప్రభావం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంతేగాక అక్కడి వారితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే, తీర ప్రాంత వర్గాల దీర్ఘకాలిక సామాజిక -ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయకుండానే టెండర్లు జరిగాయని, మీ ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా నిరసనలు వెళ్లువెత్తుతున్నాయని తెలిపారు.
ఆఫ్షోర్ మైనింగ్ టెండర్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ బహిరంగ లేఖ!
March 29, 2025
0
Tags