పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తోందని సరైన చర్చలు జరగకుండా నిరోధిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాలను ఉపయోగించి ఏ విధంగానైనా చర్చలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె అన్నారు.పార్లమెంటులో ప్రజాస్వామ్య ప్రక్రియ సమర్థవంతంగా పని చేయకుండా కేంద్రం ఆటంకం కలిగిస్తోందని, మోడీ హయాంలో ప్రజాస్వామ్య విధ్వంసం జరిగిందని అన్నారు. ప్రతిపక్షం తరచుగా పార్లమెంటు వ్యవహారాలను అడ్డగిస్తోందని ఆరోపిసప్తున్నారు. కానీ అసలు సభ సక్రమంగా జరగకుండా ఈ ప్రభుత్వమే అడ్డంకిగా మారిందని అన్నారు. ప్రతిపక్షాల గొంతును అణచివేయడం అంటే ప్రజల వాయిస్ను వినకుండా చేయడమే అని ఆమె అన్నారు.
మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు అణచివేస్తుంది !
March 29, 2025
0
Tags