బంగారం ధర వరుసగా మూడవరోజు కూడా భారీగా తగ్గింది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87440 నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80100 నమోదయ్యింది. వెండి ధర కేజీ రూ. 96,400 పలికింది. ఫిబ్రవరి నెలలో బంగారం ధర ఆల్ టైం రికార్డులను తాకింది ఒక దశలో బంగారం ధర 90 వేల రూపాయల సమీపంలో చేరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డును సృష్టించింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెర లేపిన వాణిజ్య యుద్ధమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లను కూడా విపరీతంగా నష్టపోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకుల సైతం పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ప్రధానంగా చైనా సెంట్రల్ బ్యాంక్ పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తోంది దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగిపోయింది ఫలితంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తగ్గిన బంగారం ధర !
March 01, 2025
0
Tags