పోసాని కృష్ణ మురళికి స్వల్ప అస్వస్థత ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత కలిగినట్లుగా తెలుస్తోంది. పోసాని కృష్ణ మురళి గుండెకి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నారు. నిన్న పోసాని కృష్ణ మురళి విరోచనాలకు గురవడంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పోసాని కృష్ణ మురళికి అక్కడి వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షలలో ఆయన ఆరోగ్యంలో స్వల్ప తేడా ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)