వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు !

Telugu Lo Computer
0


వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర భగ్గమంటోంది. నేడు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్.ఢిల్లీ నుంచి కోల్ కత వరకు 6 రూపాయలు పెరిగింది. అయితే మార్చిలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరల ట్రెండ్ ను పరిశీలిస్తే గత 5ఏళ్లలో మార్చి 1న అత్యల్ప పెరుగుదల ఉంది. ఇండియన్ ఆయిల్ పోర్టల్ లో ఇచ్చిన డేటా ప్రకారం మార్చి 2023లో వాణిజ్య సిలిండర్ ధర అత్యధికంగా పెరిగింది. ఆ సమయంలో ధర ఒకేసారి రూ. 352 పెరిగింది. ఈ సారి రూ. 6 మాత్రమే పెరిగింది. హైదరాబాద్ లో ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2029కి చేరుకుంది. ఫిబ్రవరిలో దీని ధర రూ. 2023 ఉండగా..జనవరిలో రూ. 2030గా ఉంది. విజయవాడలో ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1958కి చేరుకుంది. ఫిబ్రవరిలో దీని ధర రూ. 1964 ఉండగా, జనవరిలో రూ. 1957 ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)