సీనియర్ హీరోయిన్ రంభ రీఎంట్రీకి రెడీ అవుతోంది. చాలాకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సినిమా అంటే నాకెంతో ప్రేమ. వెండితెరకు తిరిగి రావడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను. కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నా.. అని రంభ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే 2023లోనూ రంభ కమ్‌బ్యాక్ ఇస్తున్నట్లు చెప్పింది. రంభ అసలు పేరు విజయలక్ష్మి. అమృత అనే పేరును స్క్రీన్ నేమ్‌గా మార్చుకుంది. ఆమె నటించిన మొదటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఇందులో ఆమె పేరు రంభ. తర్వాతి కాలంలో ఆమె రంభగానే కంటిన్యూ అయిపోయింది. తొలి ముద్దు, బంగారు కుటుంబం, ముద్దుల ప్రియుడు, హిట్లర్, అల్లుడా మజాకా!, బావగారు బాగున్నారా?, బొంబాయి ప్రియుడు, గణేష్, మూడుముక్కలాట.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. ఆమె నటించిన చివరి చిత్రం ద ఫిలింస్టార్. 2010లో బిజినెస్‌మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె కెనడాలో సెటిలైంది.
సీనియర్ హీరోయిన్ రంభ రీఎంట్రీ ?
March 01, 2025
0
Tags