సంకెళ్లు వేసి దేశానికి పంపుతున్న అమెరికా తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ చేతులకు సంకెళ్లతో అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యే !

Telugu Lo Computer
0


మెరికాలోని భారతీయ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి దేశానికి పంపుతున్న తీరుపై  నిరసన వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర లోని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తన చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తన చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌ వద్దకు వచ్చారు. 'అమెరికాలో భారతీయులు అన్యాయాన్ని ఎదుర్కొంటున్న తీరు, వారిని బంధించి బహిష్కరిస్తున్న తీరు, వీసా సమస్యల కారణంగా అమెరికాలో ఏ భారతీయుడు సురక్షితంగా లేడు. అమెరికా గురించి ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు' అని విమర్శించారు. మహారాష్ట్ర ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌కు ముందు తొలుత గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత బీహార్‌కు చెందిన సీపీఎం ఎమ్మెల్యేలు సంకెళ్లతో నిరసన తెలిపారు. భారతీయులను అవమానించిన అమెరికా తీరుపై వారు మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)