ఇరాక్-బంగ్లాదేశ్ కేంద్రంగా తుఫాన్ ఏర్పడిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్ సహా మరో 18 రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది. తుఫాన్ కారణంగా ఉత్తర భారతదేశంతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 15 వరకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో హిమపాతంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, మార్చి 15 వరకు రాజస్థాన్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే తూర్పు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మార్చి 15 వరకు వర్షాలు కురుస్తాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం సంభవించవచ్చని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ కు తుఫాన్ ముప్పు ?
March 13, 2025
0
Tags