లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 22,500 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టింది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 105 పాయింట్లు లాభంతో 74126 వద్ద.. నిఫ్టీ  12 పాయింట్లు పెరిగి 22,482 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, ఏషియన్ పెయింట్స్‌, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 71.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,953.80 డాలర్ల వద్ద కదలాడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.14 వద్ద కొనసాగుతోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)