మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ షేర్లు నేడు ట్రేడింగ్ సెషన్‌లో దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో ఏకంగా 14 శాతం పెరిగి రూ.49.29 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. ప్రస్తుతం లాభాల్లో పయనిస్తున్నాయి. ఆస్తుల విక్రయం ద్వారా నిధుల్ని సమకూర్చుకోవడమే ఇందుకు కారణం. ఎంటీఎన్‌ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తమ భూములు, భవనాలు, టవర్లు, ఫైబర్ విక్రయం ద్వారా మొత్తం రూ.12,984.86 కోట్లను ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న లోక్‌సభలో తెలిపారు. తమ ప్రధాన కార్యకలాపాలకు వినియోగించని ఆస్తులనే ఆయా సంస్థలు నగదీకరణ చేశాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమోదించిన విధానానికి అనుగుణంగానే ఆస్తుల మానిటైజేషన్ జరుగుతుందని వెల్లడించారు. భూమి, భవనాల విక్రయం ద్వారానే 2025 జనవరి నాటికి ఎంటీఎన్‌ఎల్ రూ.2,134.61 కోట్ల, బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2,387.82 కోట్లు సమకూర్చుకుందన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో షేర్లు రాణిస్తున్నాయి. 10:50 గంటల సమయంలో ఎంటీఎన్‌ఎల్ షేర్లు 12.58 శాతం లాభంతో రూ.48.58 వద్ద ట్రేడవుతోంది.
ట్రేడింగ్ సెషన్‌లో దూసుకెళ్తున్న ఎంటీఎన్‌ఎల్ షేర్లు !
March 13, 2025
0
Tags