కులగణనలో కేసీఆర్‌ కుటుంబం పాల్గొనలేదు !

Telugu Lo Computer
0


తెలంగాణలో కులగణన శాస్త్రీయంగా జరిగిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దీనిలో పాల్గొనలేదని చెప్పారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ  ''కేసీఆర్‌ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసింది. గత ప్రభుత్వం కేవలం రైతుబంధు ఇచ్చి మిగతా అన్ని పథకాలూ ఆపేసింది. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. సన్న వడ్లు పండించిన వారికి రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులన్నీ వేగంగా ముందుకెళ్తున్నాయి'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)