బీసీసీఐ ఫ్యామిలీ పాలసీ మారదు: దేవ్‌దత్‌ సైకియా

Telugu Lo Computer
0

బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులు లేవని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌దత్‌ సైకియా అన్నారు. కొన్ని రోజుల క్రితం దీనిపై విరాట్‌ కోహ్లీ  తన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత క్రీడాకారులు మ్యాచుల నిమిత్తం విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు వారి కుటుంబసభ్యులతో ఉండే సమయంలో బీసీసీఐ కోత విధించింది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారతజట్టు ఆస్ట్రేలియా మీద 1- 3 తేడాతో సిరీస్‌ ఓడిపోయిన తర్వాత బీసీసీఐ కొన్ని కఠిన నియమాలను అమల్లోకి తెచ్చింది. సమీప భవిష్యత్తులో వీటిలో ఎటువంటి మార్పులూ లేవని బీసీసీఐ కార్యదర్శి సైకియా తాజాగా మరోసారి స్పష్టం చేశారు. ఐపీఎల్‌ అనంతరం జూన్‌, జులైలో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో 5 టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)