తెలంగాణ హైకోర్టులో స్పై కెమెరాల విక్రయాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగింది. ''ఆన్‌లైన్, షాపుల్లో సులభంగా స్పై కెమెరాలు లభిస్తున్నాయి. ఇటీవల మహిళల వసతి గృహాల్లోని బాత్‌రూమ్‌లు, గదుల్లో ఇవి బయటపడ్డాయి. స్పై కెమెరాల విక్రయాలపై నియంత్రణ ఉండాలి'' అని న్యాయవాది శ్రీరమ్య కోర్టును కోరారు. అవి దుర్వినియోగమైతే చర్యలు తీసుకునేలా చట్టాలున్నాయని కేంద్రం తరఫు న్యాయవాది ముఖర్జీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రతి మొబైల్‌లోనూ కెమెరాలున్నాయని, వాటిని ఎలా నియంత్రించగలమని ఈ సందర్భంగా సీజే ప్రశ్నించారు. మొబైల్ కెమెరాలను గుర్తించే అవకాశం ఉందని, స్పై కెమెరాలను రహస్యంగా అమర్చుతున్నారని న్యాయవాది శ్రీరమ్య తెలిపారు. స్పై కెమెరాల విక్రయాలపై మార్గదర్శకాలు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. స్పై కెమెరా నియంత్రణ విధించే వస్తువు కాదని కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. వీటి విక్రయాలపై కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమన్న తెలంగాణ హైకోర్టు పిటిషన్‌పై విచారణను ముగించింది.
స్పై కెమెరాల విక్రయాలపై కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు !
March 19, 2025
0
Tags