తెలుగు చిత్రసీమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటీమణి హేమ, ఇప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించింది. తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి, ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఇకపై కొత్త ప్రాజెక్ట్‌లను చేయబోనని తేల్చిచెప్పింది. "జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా? కొంచెం బ్రేక్ తీసుకోవాలి కదా" అంటూ ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. హేమ గతంలో ఎన్నో కామెడీ పాత్రలు పోషించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అతడు, దేశముదురు, భగీరథ, శ్రీరామదాసు, మల్లీశ్వరి వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే తాజాగా, పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినా, ఇకపై నేను నటించనని తేల్చిచెప్పింది.
నటనకు గుడ్‌బై చెప్పిన నటి హేమ ?
March 19, 2025
0
Tags