గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉంది : ప్రధాని మోడీ

Telugu Lo Computer
0

                                      

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ''ఒక అమ్మాయి ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నిస్తారు. కానీ, మగపిల్లల విషయంలో మాత్రం అలా జరగదు. కానీ, వారిని కూడా ప్రశ్నించాలి. గడిచిన దశాబ్దంలో మహిళల భద్రత, మహిళలపై జరుగుతోన్న నేరాలను అరికట్టేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. నిబంధనలు, చట్టాలు కూడా మార్చాం. లైంగికదాడి వంటి తీవ్రమైన నేరాల్లో మరణశిక్ష విధించేలా చట్టాలు సవరించాం'' అని ప్రధాని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీజీ చెప్పిన మాటలను గుర్తు చేసిన ఆయన.. మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా దానికి జత చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. త్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చి లక్షల మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనం కాకుండా కాపాడామన్నారు. మహిళల సారథ్యంలోని ఎన్నో సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం కలిగిన తాను ప్రపంచంలోనే అత్యంత ధనికుడినని కార్యక్రమ ఆరంభంలో ప్రధాని మోడీ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)