అన్నామలై రాష్ట్రానికి కాకుండా పార్టీకి విధేయతగా ఉన్నారు : డీకే శివకుమార్‌

Telugu Lo Computer
0


చెన్నైలో నియోజవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వీటిపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ అన్నామలై రాష్ట్రానికి కాకుండా పార్టీకి విధేయతగా ఉన్నారని విమర్శించారు. జేఏసీ సమావేశం సమయంలో పార్టీ నేతలతో కలిసి అన్నామలై నిరసన చేశారు. ఆ సమయంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాలను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు. వీటిపై తాజాగా శివకుమార్‌ స్పందించారు. 'అన్నామలైకి రాష్ట్ర విషయాల కంటే.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలు దేశానికి ఏం చెబుతున్నారనేదే ముఖ్యం. ఆయనకు ఏదీ తెలియదు. అన్నామలై రాష్ట్రానికి కాకుండా పార్టీకి విధేయత చూపుతున్నారు' అని ఆయన విమర్శించారు. ఇక జేఏసీ సమావేశంలో పార్లమెంటు స్థానాలు తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని కుదించేందుకు అనుమతిస్తే మాతృ దేశంలోనే రాజకీయ అధికారంలేని పౌరులుగా మారిపోతామని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ పోరాటం పునర్విభజనకు వ్యతిరేకం కాదని, న్యాయంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా 'న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన కోసం ఉమ్మడి కార్యాచరణ కమిటీ'ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)