పీఎం ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా సంజయ్ మిశ్రా

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా మాజీ ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. సంజయ్ మిశ్రా ఈఏసీ-పీఎంలో పూర్తి సభ్యుడిగా ఉండనున్నారు. సంజయ్ మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణుడు. అనేక ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఈడీ చీఫ్‌గా ఆయన పదవీకాలం నవంబర్ 18, 2023 వరకు రెండుసార్లు పొడిగించబడింది. నిన్నఅర్థరాత్రి ఉత్తర్వులో మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పూర్తి సమయం సభ్యునిగా కార్యదర్శి హోదాలో నియమించడానికి ఆమోదం తెలిపింది.  ఈఏసీ-పీఎం అనేది ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆర్థిక మరియు సంబంధిత అంశాలపై సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన ఒక స్వతంత్ర సంస్థ.




Post a Comment

0Comments

Post a Comment (0)