అమెరికాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా భట్టాచార్య ఎన్నికైనట్లు యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది. వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్‌గా భారతీయ మూలాలు ఉన్న జయ్ భట్టాచార్యను నియమిస్తున్నట్లు నవంబర్‌లో ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. ''భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య ఎన్‌ఐహెచ్‌ను నడిపించడంతో పాటు దేశప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు పని చేస్తారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు వారిద్దరూ కలిసి కృషి చేస్తారు'' అని అప్పుడు పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై జయ్ భట్టాచార్య ఆనందం వ్యక్తంచేశారు. ''అధ్యక్షుడు ట్రంప్ నన్ను తదుపరి ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించారు. మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తాం'' అని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే యూఎస్ సెనెట్ ఆమోదం లభించింది.
యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా జయ్ భట్టాచార్య
March 26, 2025
0
Tags