కోల్కతా లోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్టేడియంను విద్యుత్ లైట్లతో, లేజర్ కాంతులతో అలకరించారు. వేడుకలను చూడడానికి పెద్ద సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియానికి తరలివచ్చారు.క్రేజీ పాటలతో క్రీడాభిమానులను సింగర్స్ ఉర్రూతులూగించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. దేశంలోని 13 నగరాల్లో నిర్వహించబోయే ఈ మెగా ఈవెంట్లో 74 మ్యాచ్ (70 లీగ్, 4 నాకౌట్)లు జరగనున్నాయి. టోర్నీలో పాల్గొనబోయే పది జట్లను రెండు గ్రూపులు విభజించారు. గ్రూప్-ఏలో చెన్నై, కోల్కతా, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా గ్రూప్-బీలో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి.
అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ వేడుకలు
March 22, 2025
0
Tags