ఉత్తరప్రదేశ్లోని సహరాన్‌పూర్ జిల్లాలో సంగతేడ గ్రామానికి చెందిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు యోగేష్ రోహిల్లా భార్య, పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో కుమార్తె, కుమారుడు మరణించారు. భార్య, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బీజేపీ నేతను అరెస్ట్ చేశారు. శనివారం దారుణానికి పాల్పడ్డాడు. భార్య, ముగ్గురు పిల్లలపై గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం యోగేష్ రోహిల్లా పోలీసులకు ఫోన్ చేశాడు. భార్య, పిల్లలపై కాల్పులు జరిపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పుల్లో ఒక కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె మరణించినట్లు గుర్తించారు. భార్య, మరో కుమారుడ్ని సహారన్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాల్పులకు వినియోగించిన గన్ స్వాధీనం చేసుకున్నారు. భార్యపై అనుమానంతో ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. యోగేష్ మానసిక పరిస్థితి సరిగా లేనట్లుగా తెలిసిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ కాల్పుల సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భార్య, పిల్లలపై కాల్పులు జరిపిన బీజేపీ నేత
March 22, 2025
0
Tags