ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ హతం ?

Telugu Lo Computer
0


ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడుల్లో అతడి మేనల్లుడు అబూ ఖతత్ మరణించాడు. అయితే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హఫీస్ సయీద్ రావల్పిండిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కోర్ కమాండర్‌ని కలిసి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మరణించిన అబూ ఖతల్ హఫీస్ సయీద్‌కి ముఖ్య అనుచరుడు, లష్కరే తోయిబాలో కీలక వ్యక్తి. 2024 జూన్ 9న జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడి నుండి కాట్రాకు వెళ్తున్న బస్సుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అబూ ఖతల్ ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)