ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈయన చేసిన వ్యాఖ్యలపై తమిళ రాజకీయాలలో పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపడమే కాకుండా పవన్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. జనసేన ఆవిర్భావ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చురకలు అంటించారు ప్రస్తుతం హిందీ భాషను ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళ చిత్ర పరిశ్రమపై కూడా విమర్శలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలచిన త్రిభాషా సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఈయన తెలిపారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ గతంలో ఈయన ఉత్తరాది రాష్ట్రాల గురించి అక్కడ భాష గురించి మాట్లాడిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఉత్తరాది అహంకారం అంటూ ఈయన గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక ఈ వీడియోలు చూసిన పలువురు పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి కంటే కూడా చాలా వేగంగా రంగులు మారుస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ పవన్ కళ్యాణ్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. విజయ్ పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం అనే భావన నుంచి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చిందని తెలిపారు. ఆవిర్భావ సభ జనసేన పార్టీది అయినప్పటికీ ఏజెండా మాత్రం బిజెపిది అంటూ విమర్శించారు. తమకు ఇతర భాషలపై చాలా గౌరవం ఉందని తెలిపారు. అలాగని ఆ భాషను మాపై రుద్దటం ఏమాత్రం మంచిది కాదని కూడా హెచ్చరించారు. మన దక్షిణాదిలో తెలుగు తమిళ కన్నడ మలయాళీ భాషలు ఉన్నాయి. వీటిని కాకుండా హిందీని మూడో భాషగా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం !
March 17, 2025
0
Tags