హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కు రూ. 75 లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ !

Telugu Lo Computer
0


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు నిబంధనలు పాటించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.75 లక్షల జరిమానా విధించింది. కేవైసీకి సంబంధించి 2016లో ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించని కారణంగా హెచ్‌డీఎఫ్‌సీపై ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ అండ్ సింధు బ్యాంకుపై కూడా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకుకు రూ. 68 లక్షల ఫైన్ విధించింది. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం, ఆర్థిక చేరిక మార్గదర్శకాలను నివేధించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుపై ఫైన్ విధించింది. ఈ రెండు బ్యాంకులపై తీసుకున్న ఈ చర్య ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)