నిన్నటి భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఆటో దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఉదయం నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. టెలికాం, ఫార్మా, ఆటో సూచీలు మినహా అన్ని సూచీలు ఈరోజు రాణించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 77,606 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 23,591 వద్ద స్థిరపడింది.
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ల సూచీలు !
March 27, 2025
0
Tags