కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లిన ఘటన పెను విషాదం నింపిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి బాధిత కుటుంబాల పునరావాసం కోసం నిర్మించనున్న మోడల్ టౌన్ షిప్ కు కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయనాడ్ బాధితుల పునరావాసం కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు ఆర్థిక సాయం అందలేదని వెల్లడించారు. పునరావాస పనులకు కేవలం రుణం మాత్రం అందిందని, అది కూడా తగినంతగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం కోసం కేంద్రం తన మూలధన పెట్టుబడి పథకం నుంచి దాదాపు రూ.529.50 కోట్ల రుణం మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయన్ ప్రస్తావించారు. కేంద్రంతో తమకు ఉన్న గత అనుభవాల నుంచి ఇంకేమీ ఆశించలేమన్నారు.
వయనాడ్ బాధితుల పునరావాసం కోసం కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందలేదు !
March 27, 2025
0
Tags