20% క్షీణించిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు !

Telugu Lo Computer
0


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా కుంగాయి. మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. బ్యాంక్‌కు చెందిన డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. తమ డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోలో అవకతవకల్ని గుర్తించినట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అంతర్గత సమీక్షలో వెల్లడించింది. దీంతో బ్యాంక్‌ నికర విలువపై దాదాపు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడనున్నట్లు బ్యాంక్‌ అంచనా వేసింది. అంటే ఏకంగా రూ.1,530 కోట్ల నష్టానికి సమానం. ఈ ప్రకటన షేర్లపై ఒత్తిడి పెంచింది. దీంతో షేర్లు 20 శాతం మేర కుంగాయి. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ ఏకంగా రూ.14 వేల కోట్లు క్షీణించింది. గతేడాది డిసెంబర్‌ నాటికి బ్యాంక్‌ నికర విలువ రూ.65,102 కోట్లుగా ఉంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కుంగాయి. ప్రస్తుత సీఈఓ సుమంత్‌ కత్పలియా పదవీకాలాన్ని మూడేళ్లు కాకుండా, ఒక సంవత్సరం పాటే పొడిగించేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఈ ప్రకటనతో షేర్లు సోమవారం బీఎస్‌ఈలో 3.86 శాతం నష్టంతో రూ.900.70 వద్ద ముగిశాయి. గత సంవత్సరంలో బ్యాంక్‌ షేర్లు 42.42 శాతం క్షీణించాయి. గత ఆరు నెలల్లోనే 37.24 శాతం కుంగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)