గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సులో భోజన ప్లేట్ల కోసం కొట్లాట : వీడియో వైరల్‌

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 24-25 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రారంభించారు. దీనికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మదుపర్లు హాజరై రూ.లక్షల కోట్ల మేర పెట్టబడులను ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమంలో సామన్య ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు మాత్రం అరకొరగా ఉన్నాయి. ఈ సదస్సుకు వచ్చిన సామాన్యులు భోజన ప్లేట్ల కోసం కొట్లాడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. అయితే, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీపడ్డారు. దీంతో కొన్ని ప్లేట్లు విరిగి కిందపడ్డాయి. ఈ దృశ్యాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రపంచస్థాయి సదస్సులో ఇలాంటి ఏర్పాట్లు బాధాకరమంటూ మండిపడ్డాయి. ఇందులో తమ రాష్ట్రంలో రూ.26.61లక్షల కోట్ల పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత ఒప్పందాలు అమలైతే రాష్ట్రంలో 17.3లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించొచ్చని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)