ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం పైన సర్వే మొదలు పెట్టింది. ఇంటింటికి అధికారులు వెళ్లి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా అనే అంశం పైన ఆరా తీస్తోంది. ఈ రకంగా పని చేసుకోవటానికి ఉన్న సమస్యలు ఏంటని తెలుసు కొనే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారని వివరాలు సేకరిస్తోంది. ప్రతీ ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్లి వారి వివరాలు సేకరిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ లోగా ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. సర్వేలో సేకరించిన ఆధారాల ను క్రోడీకరించి ప్రభుత్వం ఈ విధానం అమలు పైన కార్యాచరణ ఖరారు చేయనుంది. వివిధ సంస్థల కోసం ప్రస్తుతం ఇళ్ల నుంచి పని చేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, దాని స్పీడ్, విధి నిర్వహణకు గదుల కొరత తదితరాలను ఈ సర్వేలో గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఇందుకు అనుగుణంగా విద్యార్హత కలిగిన వారిని గుర్తిస్తున్నారు. వారి భవిష్యత్ ప్రణాళిక లు, వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పిన గురించి వివరించనున్నారు. అర్హత ఉన్న వారికి ఇంటి నుంచే పని చేయడానికి ఎలాంటి సదుపాయాలు కావాలి వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు ప్రైవేట్ భవనాలు అందుబాటులో ఉన్నాయా అనే వివరా లనూ సేకరిస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువమంది వర్క్ ఫ్రంహోం చేసేందుకు సుముఖంగా ఉంటే అలాంటిచోట ఒక సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే పూర్తయ్యాక వివిధ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలని భావిస్తోంది. ఈ మేరకు వారి ప్రాంతాల్లోనే పని చేసుకొనేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సర్వే పూర్తయిన తరువాత మొత్తం ప్రక్రియ పైన స్పష్టత రానుంది.
వర్క్ ఫ్రం హోం అమలు దిశగా కసరత్తు !
February 26, 2025
0
Tags