అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై రాకపోకలు ప్రారంభం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశంతో ఫ్లైఓవర్‌పై రాకపోకలు కొనసాగుతున్నాయి. ఫ్లైఓవర్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కింద భాగాన రోడ్డు నిర్మాణం, గ్రీనరీ, సుందరీకరణ పనులు పూర్తి చేసి అధికారికంగా మరి కొన్ని రోజుల్లో ఫ్లైఓవర్‌ ప్రారంభించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికుల సౌకర్యార్థం మహాశివరాత్రి నుంచి ఈ పైవంతెనపై రాకపోకలకు అనుమతించాలని కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన నిన్న ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించారు. కేంద్రమంత్రి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ దశాబ్దాల కల దీనికోసం చాన్నాళ్లుగా స్థానికులు, ఈ మార్గంలో రోజూ ప్రయాణించే వారు ఎదురుచూస్తున్నారు. శివరాత్రి సందర్భంగా అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)